ప్రియ వారియర్ పేరు ఎరగని యూత్ ఉంటారు అంటే ఎవరూ నమ్మరు. ఈ ఏడాది ఇండియన్ గూగుల్ సెలబ్రెటీస్ టాప్ సెర్చెడ్ బ్యూటీగా నిలిచిన ప్రియా ప్రకాష్ వారియర్ మీడియాలో ఒక సంచలనం. కళ్ళతోనే రొమాన్స్ చేసిన ఈ మళయాళ బ్యూటీ గురించి వార్తలు ప్రసారం చేయని మీడియా సంస్థలు ఇండియాలో లేవు. 

ఈమెకు ఏర్పడ్డ ఈ క్రేజ్ తో ఈమెను తెలుగు సినిమాలలో నటింప చేయాలని భారీ పారితోషికాలు ఆఫర్ చేస్తూ ఎందరో ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఆ ప్రయత్నాలకు ప్రియ వారియర్ నుండి స్పందన రాకపోవడంతో చాలామంది దర్శక నిర్మాతలు నిరుత్సాహ పడుతున్నారు. ఇలాంటి క్రేజ్ ఉన్న ఈ బ్యూటీ వేసిన ఒక తప్పటడుగు వల్ల ప్రస్తుతం ఈమె ఇమేజ్ బాగా దెబ్బతింది. సాధారణంగా గ్లామర్ మీద ఆధారపడే హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ చేయడం సర్వసాధారణం. 

తమ ఎక్స్ పోజింగ్ ద్వారా తమ క్రేజ్ ను పెంచుకోవాలని చాలామంది హీరోయిన్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈమె కూడ అటువంటి ప్రయతమే చేసి ఊహించని స్థాయిలో విమర్శలుఎదుర్కుంటోంది. ఒక ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం ప్రియ వాలియర్ ఈమధ్య లేటెస్ట్ గా ఇచ్చిన ఫోటో షూట్ పై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ఈ ఫోటో షూట్ లో ప్రియ వారియర్ ఎక్స్ పోజింగ్ చేస్తూ తీయించుకున్న ఫోటోలు ఏమాత్రం బాగా లేవనీ ఆమెకు ఈ ఎక్స్ పోజింగ్ ఏమాత్రం సూట్ అవ్వలేదని కామెంట్స్ వస్తున్నాయి. 

అంతేకాదు సాధారణ గ్లామర్ హీరోయిన్స్ లాగా ఒక మోడ్రన్ డ్రెస్ లో ఇచ్చిన పోజుల్లో ఏ మాత్రం గ్లామర్ కనిపించలేదని ఆమె హావభావాలు కూడా సరిగా లేవనే కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి ప్రయోగాలు వల్ల ఆమెకు క్రేజ్ కన్నా విమర్శలు ఎక్కువగా వస్తాయని ఇప్పటికైనా ఆమె తన తీరు మార్చుకుని ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటే బాగుంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాది వేలెంటైన్స్ డేకి ఆమె నటించిన మలయాళం సినిమా ‘ఒరు అడార్ లవ్’ తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయబోతున్న నేపధ్యంలో ఆమె ఇమేజ్ పై ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ రావడం ఏమాత్రం మంచిది కాదు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: