తన భర్తతో గడపడానికి అంటె తన కాపురానికి చాలా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని అంటోంది నటి రాధికా ఆప్తే. అది చాలా ఎక్స్-పెన్సివ్ అని ఈ అందాల హీరోయిన్ తెగ వేదన పడుతోంది. అసలు భర్తతో గడపడానికి ఖర్చవ్వడం ఏమిటి? అంటే, మన హీరోయిన్ చమత్కారం (అలా కనిపించే బాధ కూడా! పాపం!) కొంత ఉంది. భర్తను కలవడానికి ఆమె చాలా ఖర్చు పెట్టు కోవాల్సి వస్తోందట. ప్రయాణం లో తీవ్ర అలసట, నీరసం వచ్చే సంసారంగా చెపుతూ వస్తున్నారు.
ఇందులో డబల్ మీనింగ్ ఏమీలేదు. సింగిల్ మీనింగే. ఎందుకంటే, రాధికా ఆప్తే భర్త బెనెడిక్ట్ టేలర్ ఒక బ్రిటిష్ పౌరుడు. అతడు కంపోజర్. అతని జన్మభూమి గ్రేట్ బ్రిటన్ అందుకే ఆయన బ్రిటన్ లోనే ఉంటాడు. అతడిని కలవడానికి రాధిక ఆప్టే అప్పుడప్పుడు అవకాశాన్ని బట్టి వెళ్తూ ఉంటుందట. బ్రిటన్ కు వెళ్లడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నెలకు ఒకటీ రెండు సార్లు తను బ్రిటన్ వెళ్తూ ఉంటానని, దీంతో తనకు చాలా డబ్బు ఖర్చు అవుతోందని రాధిక చెబుతోంది. అందు వలన తను ఎక్కువగా విమానంలో ఎకాకనమీ క్లాస్ లోనే ప్రయాణిస్తూ ఉంటానని రాధిక ఆప్టే అన్నారు.
ఈ విషయాన్ని తాను ప్రయాణించే ఫ్లైట్ లో తనను చాలా మంది "పేరున్న నటివై యుండి ఎందుకు మీరు బిజినెస్-క్లాస్ లో వెళ్లడం లేదు? ఎకానమీ-క్లాస్ లో ఎందుకు ప్రయాణిస్తున్నారు?" అని అడుగుతారని, ఎక్కువ ప్రయాణాల వలన ఆయ్యే ఖర్చును కొంతైనా తగ్గించుకోవడానికే తను ఇలా చేయక తప్పట్లేదని అని రాధిక ఆప్టే మీడియా సముఖంగా వివరించింది.
ఒక్కోసారి అడ్వాన్స్-బుకింగ్ కుదరక అప్పటికప్పుడు టికెట్స్-బుక్ చేసుకోవాల్సి సందర్భం వస్తుందని - మొత్తం మీద భర్తతో కాపురం తనకు ఖర్చు, అలసటతో కూడు కున్న వ్యవహారం అవుతోందని రాధిక ఆప్టే చెప్పింది.