ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిన హీరోయిన్స్ లిస్టులో స్నేహ టాప్ లిస్టులో కొనసాగుతూ ఉండేది. హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె తెలుగులో చాలమంది సీనియర్ హీరోలతో నటించినా పెళ్లి తరువాత తన సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈమె రీ ఎంట్రీ ఇటీవలే విడుదలైన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో రామ్ చరణ్‌కి వదిన పాత్రతో మొదలైంది.
ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె రామ్ చరణ్ గురించి ప్రస్తావిస్తూ అతడిని తెగపోగడటమే కాకుండా చరణ్ వ్యక్తిత్యం పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈమూవీ షూటింగ్ ప్రారంభంలో చరణ్ తనతో ఎలా ఉంటాడో అని భయపడిన సందర్భాలను వివరిస్తూ ఈమూవీ షూటింగ్ స్పాట్ లో చరణ్ సింప్లిసిటీ తనకు ఎంతో నచ్చింది అని కామెంట్స్ చేసింది.
ఈమూవీ షూటింగ్ సమయంలో పెద్ద ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ అన్న తేడాలేకుండా చరణ్ అందరినీ గౌరవిస్తూ అందరితో ఇట్టే కలిసిపోయాడని చెపుతూ ఎంతో ఆప్యాయంగా అందరితో కలిసిపోవడం చరణ్ మంచి లక్షణం అంటూఅభిప్రాయపడింది. అంతేకాదు షూటింగ్ స్పాట్ లో చరణ్ తనకు ఒక తమ్ముడిగా మారిపోయాడు అంటూ చరణ్ పై స్నేహ కురిపించిన ప్రశంసలు మెగా అభిమానులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి.
ప్రస్తుతం యంగ్ హీరోలకు సంబంధించిఅందమైన అత్త అమ్మ పాత్రలకు సంబంధించి మంచి డిమాండ్ ఉన్న నేపధ్యంలో ‘వినయ విధేయ రామ’ ఫెయిల్ అయినా స్నేహకు మరింత మంచి అవకాశాలు వచ్చే అవకాసం ఉంది అని అంటున్నారు. దీనికితోడు ఈమె పారితోషికం కూడ చాలామంది దర్శక నిర్మాతలకు అందుబాటులో ఉండటంతో అంటీ అమ్మ వదిన పాత్రలకు కొంతకాలం స్నేహ చిరునామాగా మారే ఆస్కారం ఉంది..