కమెడియన్ బాబు మోహన్ ఈమధ్య జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయి తిరిగి యూటర్న్ తీసుకుని ప్రస్తుతం ఒక ప్రముఖ దర్శకుడు నిర్మిస్తున్న మూవీలో తనకు అలవాటైన కమెడియన్ పాత్రను పోషిస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో నిన్న సాయంత్రం ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు వివరిస్తూ మధ్యలో పవన్ కళ్యాణ్ రాజకీయాల పై కూడ ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
TRS MLA babu mohan with kommineni srinivasa rao
తెలుగు సినిమా రంగంలో ఒక్క నందమూరి తారక రామారావుకు తప్పించి మరెవ్వరికీ రాజకీయాలు కలిసి రాలేదని ప్రస్తుత పరిస్థుతులలో జనం సినిమా స్టార్స్ ను సినిమాలలో చూసి అభిమానిస్తారు కానీ ఓట్లు వేసే విషయంలో అనేక ఆలోచనలు చేస్తారని అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో ఆ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధి పవన్ ‘జనసేన’ పై అభిప్రయాన్ని కోరగా అమితాబ్ బచన్ లాంటి టాప్ సెలెబ్రెటీలు కూడ రాజకీయాలలో ఫెయిల్ అయ్యారు అంటూ ఓటర్ల స్పందన అంచనా వేయడం చాలా కష్టం అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. 

ఇదే సందర్భంలో బాబు మోహన్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలలో రాణించే రాజకీయ నాయకులు విపరీతంగా నటిస్తున్నారు అంటూ అలాంటి నటనా సామర్ధ్యం లేకుంటే ఎతంటి టాప్ స్టార్ అయినా రాజకీయాలలో ఫెయిల్ అవడం ఖాయం అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియచేసాడు. ఇక తనకు ఎదురైనా కమెడియన్ అలీ రాజకీయ రంగప్రవేశం గురించి  మాట్లాడుతూ తానూ అలీకి ఏదైనా సలహాలు ఇస్తే తానూ ఈర్షతో ఇచ్చాను అనుకుంటాడని అందువల్ల ఆవిశాయమై తాను ఎలాంటి కామెంట్స్ చేయలేనని తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. 
Babu Mohan
వందల సినిమాలలో తాను విభిన్న పాత్రలు పోషించినా తాను ప్రస్తుత తరం వ్యక్తులను అర్ధం చేసుకోలేక పోతున్నానని అంటూ ఇండస్ట్రీలో తనకు ఏ కమెడియన్ తో అభిప్రాయ భేదాలు లేవని స్పష్టం చేసాడు. ముఖ కవళికలు సరిగ్గాలేని వ్యక్తులు కూడ హీరోలుగా మారిపోతున్న పరిస్థుతులలో ప్రస్తుతం ఇండస్ట్రీ నడుస్తున్న తీరు తలలు పండిన వారికి కూడ అర్ధంకాని విషయంగా మారిందని బాబు మోహన్ నేటి ఇండస్ట్రీ పరిస్థుతుల పై సెటైర్లు వేసాడు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: