ఈ మద్య టాలీవుడ్ లో కమెడియన్ల జోరు కొనసాగుతుంది. సందీప్ వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’సినిమాలో కమెడియన్ గా పరిచయం అయిన రాహూల్ రామకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లో కమెడియన్ గా కొనసాగుతున్నారు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించిన రాహూల్ రామకృష్ణ ‘అర్జున్ రెడ్డి’సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు.
ఇటీవల విడుదలైన గీత గోవిందం చిత్రంలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించి నవ్వుల పువ్వులు పూయించాడు. తెలంగాణ యాసతో తనదైన కామెడీ మార్క్ చాటుకుంటున్న రాహూల్ రామకృష్ణ త్వరలో హాలీవుడ్‌కి పరిచయం కానున్నాడని అంటున్నారు. ప్రదీప్ కటసాని దర్శకత్వంలో సిల్క్ రోడ్ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో రాహుల్ కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ సినిమా తెలుగు గ్రాడ్యుయేట్ నేపథ్యంలో ఉంటుందట.
ఓ యువకుడు ఉన్నత విద్య అభ్యసించడానికి యూఎస్ కి వెళ్లి అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడు అనే నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందట. డ్రగ్స్, సైబర్‌క్రైమ్ నేపథ్యంలో సినిమా కథ తిరుగుతుంది. హాలీవుడ్ సినిమాలో తనకు నటించే ఛాన్స్ వచ్చినందుకు రాహూల్ రామకృష్ణ తెగ సంబరపడి పోతున్నాడు. అ సినిమా కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నానని..తన కల ఇప్పటికి నెరవేరిందని రాహుల్ అన్నాడు.