‘మహర్షి’ సినిమా విడుదల ఏప్రియల్ 25 నుండి మరొకసారి వాయిదా పడే పరిస్థుతులకు దర్శకుడు వంశీ పైడిపల్లి ఈమూవీ విషయమై అనుసరిస్తున్న విధానాలే కారణం అంటూ ఇప్పటి వరకు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈమూవీ వాయిదా వెనుక అసలు కారణం మహేష్ వింత ప్రవర్తన అన్న గుసగుసలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి.
తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్ ‘మహర్షి’ షూటింగ్ స్పాట్ లో గతంలో లా స్పీడ్ గా తన వర్క్ ఫినిష్ చేయడం లేదనీ దీనికితోడు షూటింగ్ స్పాట్ లో మహేష్ కొద్దిగా డల్ గా కనిపిస్తున్నాడని టాక్. దీనికితోడు షూటింగ్ స్పాట్ కు ఆలస్యంగా రావడమే కాకుండా ఒకొక్కసారి తన వర్క్ ను తొందరగా ఫినిష్ చేయమని లేకుంటే మరునాడు షూట్ చేయమని మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లి పై ఒత్తిడి చేస్తున్నట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.
ఈ నేపధ్యంలో మహేష్ కు ఏమైంది అంటూ గుసగుసలు హడావిడి చేస్తున్నాయి. ఈమధ్య కాలంలో మహేష్ కు తన సినిమాలకు సంబంధించిన పనులు మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్ మెంట్లు తన పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చిన్న సినిమాల నిర్మాణం వెబ్ సీరీస్ ఆలోచనలు ఇలా ఒకేసారి మహేష్ నాలుగు వ్యాపారాలు చేస్తున్న నేపధ్యంలో మహేష్ కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉన్నట్లు టాక్.
దీనికితోడు మహేష్ ఈమధ్యనే నిర్మించిన మల్టీ ఫ్లేక్స్ ధియేటర్లు అనేక విషయాలలో వివాదాలకు చిరునామాగా మారడం కూడ మహేష్ ను కలవర పెడుతున్నట్లు టాక్. అంతేకాకుండా మహేష్ నటిస్తున్న ‘మహర్షి’ తన కెరియర్ కు సంబంధించి 25వ సినిమా కావడంతో ఈసినిమా ఎట్టి పరిస్తుతులలోను బ్లాక్ బస్టర్ హిట్ అయి తీరాలి అని టెన్షన్ పడుతున్న పరిస్థుతులలో వంశీ పైడిపల్లి ‘మహర్షి’ సినిమాను ఎంత శ్రద్ధ పెట్టి తీసినా ఆ సీన్స్ మహేష్ కు నచ్చకపోవడంతో ఈమూవీ రీ షూట్స్ వైపు అడుగులు వేస్తూ బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయి ఈ మూవీ నిర్మాతలను అయోమయంలో పదేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..