టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ సినిమాతో పరిచయం అయిన తమన్నా ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న తమన్నాకి కొత్తలో పెద్దగా పేరు రాలేదు. కొన్ని గ్లామర్ పాత్రల్లో నటించిన ఆమె ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించి కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మొదటి పార్ట్ లో అవంతిక పాత్రలో అచ్చం దేవకన్యలా కనిపించి మంత్ర ముగ్దులను చేసింది. కాకపోతే సెకండ్ పార్ట్ లో మాత్రం తమన్నా పార్ట్ కొద్దిగానే ఉండటం నిరాశ పరిచింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గ్లామరస్ గా కనిపించడానికి తాను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించనని..ముద్దు సీన్ల విషయంలో మొదటి నుంచి అభ్యంతరాన్ని చెబుతూనే ఉన్నానని..తన అగ్రిమెంట్ లో ముద్దు సీన్లు చేయననే నిబంధన తప్పకుండా ఉంటుందని తమన్నా తెలిపింది. అయితే ఒకవేళ ఈ నిబంధన సడలించాలంటే కేవలం ఒక్క హృతిక్ రోషన్ విషయంలోనే చేస్తానని షాక్ ఇచ్చింది.
హృతిక్ రోషన్ అంటే నాకు చాలా ఇష్టం .. ఆయనకి నేను వీరాభిమానిని. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తాను. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే .. అందులో ముద్దుసీన్లు చేయవలసి వస్తే నా నిబంధనను పక్కన పెట్టేస్తాను అని చెప్పుకొచ్చింది. మరి ఈ మిల్కీ బ్యూటీకి బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ తో ఛాన్స్ ఎప్పుడు దోరుకుతుందో వేచి చూడలి.