‘గీత గోవిందం’ సూపర్ సక్సస్ తరువాత పరుశు రామ్ టాప్ హీరోలు అంతా తన వెంటపడతారు అన్న కలలు కన్నారు. అయితే టాప్ హీరోలు ఎవ్వరూ అతడి వంక చూడలేదు దీనితో చిన్న హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా పరుశు రామ్ టాప్ హీరోల నుండి పిలుపు గురించి ఎదురు చూస్తూ రోజులు గడుపుతున్నాడు.
ఇలాంటి పరిస్థుతులలో అల్లు అరవింద్ రాయబారంతో మహేష్ నుండి పరుశు రామ్ కు పిలుపు వచ్చినట్లు టాక్. ఈమధ్య సుకుమార్ కథ విషయమై అరవింద్ నమ్రతను కలిసినప్పుడు మహేష్ కు అన్నివిధాల సరిపోయే ఒక సబ్జెక్ట్ పరుశు రామ్ వద్ద ఉంది అని చెప్పినట్లు టాక్. ఈవిషయాలను తెలుసుకున్న మహేష్ పరుశు రామ్ ను పిలిపించుకుని ఆకథకు సంబంధించిన సబ్జెక్ట్ లైన్ ను విన్నట్లు తెలుస్తోంది.
ఈ లైన్ మహేష్ కు నచ్చడంతో ఆ సబ్జక్ట్ ను డెవలప్ చేయమని పరుశు రామ్ కు సలహా ఇచ్చినట్లు సమాచారం. దీనితో ఆనందం పట్టలేక పరుశు రామ్ ఈకథను మహేష్ కోసం డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు టాక్. ఎప్పటి నుంచో అరవింద్ మహేష్ తో తన సొంత సినిమా తీయాలి అని ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం మొదలైంది అని అంటున్నారు.
అయితే ప్రస్తుతం మహేష్ కు ఉన్న ఇమేజ్ రీత్యా అతడిని ఒక దర్శకుడు ఒప్పించడం చాల కష్టమైన పని. సుకుమార్ లాంటి క్రియేటివ్ దర్శకుడుకే చుక్కలు చూపించాడు మహేష్. అలాంటి పరిస్థుతులలో పరుశు రామ్ ఎంత ప్రయత్నించినా నిజంగా మహేష్ సహకరిస్తాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..