రెండు పడవలపై ప్రయాణం ఎప్పటికైనా ప్రమాదమే అని అంటుంటారు పెద్దలు. అయితే రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నా వ్యక్తిని అనుసరిస్తే కూడా ప్రమాదమే అని చెప్పవచ్చు డైరెక్టర్ శంకర్ బట్టి. ఒక పక్క సినిమాలు అంటూ మరో పక్క పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటున్న కమలహాసన్ తాజాగా ఇటీవల డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు రెండో భాగం సినిమా మొదలుపెట్టిన విషయం మనకందరికీ తెలిసినదే.
ఈ నేపథ్యంలో కమలహాసన్ షూటింగ్ విషయంలో తేదీల విషయంలో ఒకరోజు ఒక్కోలా ఉంటూ డైరెక్టర్ శంకర్ కి తలనొప్పిగా మారినట్లు ఫిలింనగర్ టాక్. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇండియన్ 2 సినిమా రీసెంట్ గా మొదలైన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ మధ్యలో కథానాయకుడు కమల్ హాసన్ పాలిటిక్స్ అంటూ పక్కదారి పట్టాడు. ఓ వైపు నిర్మాణ సంస్థ లైకా షూటింగ్ కి ఆలస్యం అయితే అనుకున్న షెడ్యూల్స్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మరో షెడ్యూల్ కి స్కెచ్ వేయాలి.
కొత్తగా ఇతర నటీనటుల డేట్స్ కోసం ప్రయత్నించాలి. అలాగే సెట్స్ కోసం మరో అధిక ఖర్చు. ఈ బాధలు భరించలేక శంకర్ పై ప్రెజర్ పెట్టేస్తున్నారు లైకా ప్రొడక్షన్స్ వారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రాజెక్ట్ ని ప్రాజెక్ట్ బాలీవుడ్ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ కి షిఫ్ట్ కానున్నట్లు తెలుస్తోంది. కుదిరితే పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకొని ఇన్ని రోజులు లైకా వారు ఖర్చు చేసిన డబ్బును కూడా వెనక్కి ఇవ్వాలని ఆ బడా సంస్థ చర్చలు జరుపుతున్నట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే సినిమా యూనిట్ వారు స్పందించాల్సిందే.