టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు మరియు రాజమౌళి కలయికలో సినిమా ఎప్పుడు వస్తుందని చాలా మంది అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల కూడా ఆసక్తిగా ఎప్పటి నుండో ఉన్నారు. అయితే తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొంటున్నారు హీరో మహేష్ బాబు.
ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మహర్షి సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో మహేష్ తన తర్వాత సినిమా ప్రాజెక్టుల గురించి తెలియజేశారు. మహర్షి సినిమా తర్వాత కామెడీ తరహాలో ఒక సినిమా చేయాలనీ అనుకున్నాను కానీ సుకుమార్ గారు చాలా సీరియస్ గా సాగే కథ కలిగిన ప్రాజెక్టును తీసుకువచ్చారు దీంతో దాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది...అయితే తర్వాత అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా అని మహేష్ బాబు పేర్కొన్నారు.
అంతేకాకుండా భవిష్యత్తులో సుకుమార్ తో తప్పకుండా సినిమా ఉంటుంది. అంతేకాదు రాజమౌళిగారితోను కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రకటన వస్తుంది" అని చెప్పుకొచ్చాడు.