ఎప్పుడో రిలీజ్ కావాల్సిన మూవీ ఆరు నెల‌ల త‌రువాత రిలీజ్ అవుతుంది. అయినా ఆ మూవీకు ఇంకా వేడి త‌గ్గలేదు, క్రేజ్ ప‌డిపోలేదు. అదే రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన అప్‌క‌మింగ్ ఫిల్మ్ ఎవ‌డు. ఎవ‌డు మూవీను రిలీజ్ చేయ‌టానికి రాష్ట్రంలో జరిగే రాజ‌కీయ ప‌రిణామాలు, అలాగే పెద్ద హీరోల మూవీలు అడ్డంకిగా మారాయి. వీటిని అధిగ‌మించి చివ‌ర‌గా 2014 సంక్రాతి కానుక‌గా రిలీజ్ చేయ‌టానికి సిద్ధప‌డ్డారు. ఇదే నెల‌లో మ‌రో భారీ మూవీ విడుద‌ల‌కు సిద్దమైంది. అదే ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టించిన ఒన్ మూవీ. వ‌న్-నేనొక్కడినే, ఎవ‌డు ఈ రెండు మూవీలు సంక్రాతి పండుగున పోటీ ప‌డుతున్నాయి. మ‌హేష్‌బాబు, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న వ‌న్ చిత్రానికి విప‌రీత‌మైన హైప్ ఏర్పడింది. ఈ మూవీ ఫైన‌ల్ అవుట్ రెడీ కాక‌ముందే ఇరోస్ సంస్థ బిజినెస్ హ‌క్కుల‌ను కైవ‌సం చేసుకోవ‌డంతో, ఈ మూవీపై ఉన్న న‌మ్మకం మార్కెట్లో మ‌రింత బ‌ల‌ప‌డింది. అలాగే ఎవ‌డు మూవీ కూడ మ‌గ‌ధీర‌ను మించి స‌క్సెస్ సాధిస్తుంద‌ని చిత్రయూనిట్ ధీమాగా ఉంది. ఎవ‌డు మూవీను వంశీ పైడిప‌ల్లి చాలా అద్భుతంగా తెర‌కెక్కించాడని, ఈ మూవీలో అంద‌రూ మెచ్చే క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయ‌ని రామ్‌చ‌ర‌ణ్ సైతం ఆనందం వ్వక్తప‌రుస్తున్నాడు. లేటెస్ట్‌గా రామ్‌చ‌ర‌ణ్ త‌న ఫేస్‌బుక్‌లో ఎవ‌డు మూవీ జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతుంది అంటూ సంక్రాతి పోటీలో ఉన్నాన‌ని అంగీక‌రించాడు. దీంతో 2014, సంక్రాంతి పండుగ కాస్త సినిమా పండుగగా మార‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: