![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/koduku-varun-kuthuru-niharika-pelli-appudo-chapina-nagababu4db5f23d-a9ff-4ac7-9b1b-cc3f7ebfff0f-415x250.jpg)
తెలుగు ఇండస్ట్రీ హీరో, హీరోయిన్స్ పెళ్లి అంటే అభిమానులలో ఎక్కడ లేని ఆసక్తి వస్తుంది.మన తెలుగు ఇండస్ట్రీలో పెళ్లి వయసు వచ్చిన కూడా బ్యాచిలర్ గానే ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు. ఇక ఈ సంవత్సరం నితిన్, నిఖిల్, రానా లు పెళ్లి పీటలేక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నితిన్, నిఖిల్ కి ఎంగేజ్మెంట్ కూడా పూర్తి అయ్యంది. ఇక రెండు రోజులలో నిఖిల్ పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. ఇక తాజాగా రానా కూడా తన గర్ల్ ఫ్రెండ్ గురించి తెలియచేయడం జరిగింది.
ఇది ఇలా ఉండగా మరో వైపు మెగా బ్రదర్ నాగబాబు కూడా తన బాధ్యతలను గుర్తుకు వస్తున్నాయి అంటూ తెలిపాడు. ఇక వచ్చే సమాచారం తన తనయుడు వరుణ్ కు, కూతురు నిహారిక కు పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాను అని నాగబాబు తెలియజేశారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఏదో మాటల సందర్భంగా వచ్చే సంవత్సరం నిహారిక పెళ్లి చేయాలనుకుంటున్నాను అని నాగబాబు తెలియజేయడం జరిగింది. వచ్చే సంవత్సరం సమ్మర్ లోపు నిహారిక పెళ్లి పూర్తవుతుంది అని నాగబాబు తెలిపారు.
ప్రస్తుతం మాత్రం సంబంధాలు చూడడం మొదలు పెట్టాం అని అన్నారు. ఇక నిహారిక పెళ్లి అనంతరం కొన్ని నెలల గ్యాప్ లోనే వరుణ్ పెళ్లి కూడా చేసేస్తాను అని తెలిపారు. ఇక పెళ్లి చేస్తే నిహారిక గురించి ఆమె భర్త, వరుణ్ గురించి అతని భర్త యోగక్షేమాలు చూసుకుంటారు అంటూ సరదాగా నాగబాబు ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక వాళ్ళిద్దరికీ పెళ్లిళ్లు చేస్తే నేను ఫ్రీ గా ఉండవచ్చు అంటూ నాగబాబు తెలిపారు.నిజానికి నిహారిక ను డాక్టర్ చేయాలని వరుణ్ నీ ఐఏఎస్ చేయాలని నా కోరిక అంటూ తెలిపాడు. కానీ ఆ రెండు కోరికలు నెరవేరి లేదు అంటూ నాగబాబు అన్నారు. ప్రస్తుతం వీరు ఇద్దరు కూడా సినిమాలలో వారికంటే ప్రత్యేకత చాటు కుంటున్నారు.