
షారుఖ్ ఖాన్.. ఈ పేరు ఏ రేంజ్లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సూపర్ స్టార్‌కు బాక్సాఫీస్ వద్ద ఎలా మ్యాజిక్ చేయాలో.. ప్రేక్షకులను ఎలా కట్టిపడేయాలో బాగా తెలుసు. అందుకే అభిమానులు ఆయనను బాద్షా ఆఫ్ బాలీవుడ్, కింగ్ ఖాన్ అని పిలుస్తారు. ఇప్పటికే షారూఖ్ దాదాపు 80 సినిమాల్లో నటించారు. ఆయన 14 ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు. ఇక ప్రస్తుతం కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించడంతో.. ఇంట్లోనే ఉంటున్నారు షారుక్. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
90లలో బాలీవుడ్ న్యూ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు షారుఖ్. అయితే అదే సమయంలో సినీ బ్లిట్జ్ అనే ఓ మ్యాగజైన్ కు చెందిన ఓ జర్నలిస్ట్‌తో షారూఖ్‌కు తరుచూ వివాదం జరుగుతుండేది. 1992లో షారుఖ్ టెంపర్మెంట్ కారణంగా అరెస్ట్ కూడా అయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షారుఖ్ మేం సాబ్ సినిమాలో దీపా సాహితో ఓ ఇంటిమేట్ సీన్లో నటించాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో సినీ బ్లిట్జ్ మ్యాగజైన్లో చిత్ర దర్శకుడు కేతన్ మెహతాను ఇబ్బంది పెట్టేలా ఓ కథనం ప్రచురితమైంది. ఇంటిమేట్ సీన్ షూటింగ్‌కు ముందు రోజు దర్శకుడు షారూఖ్, దీపాలను ఒకరాత్రి కలిసి గడపాలని సూచించాడట.
అలా గడిపితే తెల్లారి షూటింగ్లో ఇద్దరు కఫర్టబుల్గా ఫీల్ అవుతారని సూచించాడట. అంతేకాదు, షూటింగ్ సమయంలో కేవలం దర్శకుడు కేతన్ మెహతా సినిమాటోగ్రాఫర్లు మాత్రమే ఉండి ఆ సన్నివేశాన్ని తెరకెక్కించంటూ ఆ కథనంలో ప్రేర్కొన్నారు. అయితే ఆ ఆర్టికల్‌కు బై లైన్ కూడా లేకుండా ప్రచురించటంతో అది కవర్ చేసిన జర్నలిస్ట్ ఎవరు అన్న విషయం ఎవరికీ తెలియలేదు. అయితే వార్త మీడియాలో హాట్ టాపిక్ అయిన తర్వాత.. సినీ బ్లిట్జ్ జర్నలిస్ట్ కేత్ డికోస్టాను ఓ ఫిలిం ఈవెంట్లో షారూక్‌కు ఎదురుపడటంతో అతని తీవ్ర పదజాలంతో దూషించాడు. అంతేకాదు, మరుసటి రోజు ఆ జర్నలిస్ట్ ఇంటికి వెళ్లి కూడా షారుఖ్ బెదిరించారట.
దీంతో సదరు జర్నలిస్ట్ కేత్ షారూఖ్ తనపై దాడికి యత్నించాడు.. అతనిపై యాక్షన్ తీసుకోవాలంటూ కోరారు. వెంటనే షూటింగ్ చేస్తున్న షారూఖ్‌ను అరెస్ట్ చేసి బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. షారూఖ్ టాప్ హీరో కావటంతో ఆయన్ను జైలుకు తరలించలేదు. ఇక ఇంతలోనే చిక్కీ పాండే షారూఖ్‌కు బెయిల్ ఇవ్వటంతో ఆయన్ను వదిలిపెట్టారు. అయితే ఈ సంఘటనపై రెండేళ్ల తరువాత ఓ మీడియా ఇంటర్వ్యూలో స్పందించిన షారూఖ్ ఆ జర్నలిస్ట్‌కు క్షమాపణలు తెలిపాడు. ఇక ఇంత వివాదానికి కారణం అయిన ఇంటిమేట్ సీన్ సెన్సార్ కట్ చేసింది. కానీ, ఆ సీన్ లీక్ అయ్యి.. నెట్టింట్లో వైరల్ అయింది. అలా షారుఖ్ కాస్త తొందరపడడం వల్ల పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సివచ్చింది.