నిధి అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టైగర్ ష్రాప్‌తో ‘మున్నా మైకేల్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాలోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమాలో కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోనూ అభిమానులను ఆకర్షించింది. ఆ తరువాత 2018 లో చందూ మొండేటి దర్శకత్వం లో విడుదల అయిన `సవ్యసాచి` చిత్రంతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటి.
ఈ చిత్రంలో నాగచౌతన్య సరసన నటించిన ఈ బ్యూటి.. నటన పరంగా తెలుగు ప్రేక్షకలను కూడా ఆకట్టుకుంది. ఇక 2019 లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన `మిస్టర్ మజ్ను` చిత్రంలో అఖిల్ అక్కినేని సరసన నటించింది. అయితే ఈ రెండు సినిమాలు నిధికి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయితే ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టింది నిధి.
ఇందులో ఈ భామ అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం మెహమాటపడలేదు. గ్లామర్ తో ఫిదా చేసిన నిధి అగర్వాల్ పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే నిధి టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్ట్‌లో చేరిపోయిందని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరియు అతి తక్కువ సమయంలోనే నిధి అగర్వాల్ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ముందు నుంచీ నిధి అగర్వాల్ తన గ్లామర్‌తో కుర్రాళ్లు చెమటలు పట్టిస్తోంది. దీంతో ఈమెకు మరింత ఫాలోంగ్ పెరిగింది.
ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ హిందీలో కూడా అవకాశాలు అందుకుంటోంది. తెలుగులో అశోక్ గల్లా సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. అదేవిధంగా యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా అల్లుడు అదుర్స్ లో కూడా ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ కరోనా లాక్డౌన్ సమయంలో తెలుగు, తమిళ భాషలపై పట్టు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ కోర్స్ నేర్చుకుంటోంది నిధి