శ్రియ సరణ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇష్టం సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టి శ్రియ.. నేనున్నాను సినిమాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక సంతోషం సినిమాతో ఓవర్‌నైట్ స్టార్డమ్ దక్కించుకుంది ఈ బ్యూటి. అలాగే తన కెరీర్లో రజినీకాంత్, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్‌బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది.
వెండితెరపై తనకంటూ ప్రత్యక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూనే ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఇటీవలే తన రష్యన్ ప్రియుడు అంద్రేయ్ కొశ్చేవ్‌ను పెళ్లాడి శ్రియ కొశ్చేవ్ అయిపోయింది. వివాహం అనంతరం కూడా సినిమాలు చేస్తోంది శ్రియ.
అయితే ఒకప్పుడు వచ్చినట్లు మాత్రం శ్రియకి అవకాశాలు తలుపు తట్టడం లేదనే చెప్పాలి. దీంతో ఛాలెంజిoగ్ పాత్రల్లో నటించడానికి సైతం శ్రీయ సై అంటోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలోలో కుర్ర హీరోయిన్లతో సమానంగా అందాలను ఆరబోస్తూ చెమటలు పట్టిస్తోంది. ఇక తాజాగా కూడా శ్రియ హాట్ అందాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.