అమలా పాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నాయక్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటి.. ఇద్దరమ్మాయిలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు వంటి సినిమాల్లో నటించింది ఈ మలయాళ బ్యూటీ. అయితే తెలుగు చిత్రంలో కనిపించి చాలా కాలమే అవుతున్నా.. రీసెంట్గా ఆమె అనే ఓ ద్విభాషా చిత్రంతో పలకరించింది.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించకపోయినా.. అమలాపాల్‌కు మాత్రం ఎక్కడాలేని క్రేజ్‌ను తీసుకొచ్చింది. అన్ని ఇండస్ట్రీల దృష్టిని తనవైపు లాక్కుంది. ఇక తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా, జనాలు గుర్తు పెట్టుకునేటంత క్రేజ్ మాత్రం వచ్చింది. కానీ తెలుగులో చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాకపోవడంతో తమిళ, మళయాల ఇండస్ట్రీలకు వెళ్లిపోయింది.
అక్కడ సెలెక్టెవిగ్ సినిమాలు చేస్తూ.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ వస్తోంది. అలాగే మరోవైపు ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ యూత్‌కు చెమటలు పట్టిస్తోంది. ఇన్నాళ్లూ ఏమో కానీ ఇప్పుడు మరింత డోస్ పెంచేసింది పాల్. ఈ భామ సెగలకు గూగుల్ సైతం వేడెక్కిపోతుంది. అసలు నోట మాట కూడా రాకుండా ఎప్పటికప్పుడు తన అందాలతో ఊపిరి ఆపేస్తుంది అమలాపాల్. మరియు మ్యాగజైన్ కవర్ల మీద సైతం రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ.