రావు రమేష్.. ఈ పేరు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న రావు ర‌మేష్‌కు ఎంద‌‌రో అభిమానులు ఉన్నారు. రావు గోపాల్ రావు త‌న‌యుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఎన్నో ర‌కాల పాత్ర‌ల‌తో స్టార్ కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు రావు ర‌మేష్‌. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుల్లో ఈయన కూడా ఉన్నాడు. 

IHG

పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేయ‌డంలో రావు ర‌మేష్ మ‌హా దిట్ట‌‌. అస‌లు ఈయ‌న‌ లేని స్టార్ హీరో సినిమా ఉండదేమో అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాలోనూ రావు ర‌మేష్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రంలో రష్మికా మందన్నా తండ్రిగా రావు ర‌మేష్ అల‌రించాడు. 

IHG'KGF: Chapter 2 ...

ట్రైన్ ఎపిసోడ్‌కే ఈయ‌న పాత్ర ప‌రిమితం అయిన‌ప్ప‌టికీ.. ఉన్న కాసేపు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా న‌వ్వించారు. నచ్చిన విషయాన్ని అమాయకంగా బయటపెట్టే కేరక్టర్లో హీరోయిన్‌…. ఆమె ఇష్టాయిష్టాల్ని గౌరవించే తల్లిగా సంగీత, సోదరిగా హరితేజ, సమాజాన్ని ఒడిసిపట్టేసినట్టు మాట్లాడే తండ్రిగా రావు రమేష్‌ నటించారు. మొత్తానికి ఎప్ప‌టిలాగానే ఈ సినిమాలో కూడా రావు ర‌మేష్‌.. ర‌ష్మిక తండ్రి పాత్ర‌లో ఇర‌గ‌దీసి మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇక స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: