అమలా పాల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన `నాయక్` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అమలా పాల్. ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో సినిమాతో అల్లు అర్జున్ సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు వంటి సినిమాల్లోనూ అమలా పాల్ నటించింది. అయితే ఈ అమ్మడు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. క్రేజ్ మాత్రం బాగానే సంపాదించుకుంది.
ప్రస్తుతం అమలాకు తెలుగులో అవకాశాలు లేవు. కానీ.. తమిళం, మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ.. పిచ్చెక్కిస్తోంది. తాజాగా కూడా అమలా పాల్ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.