మాతృదేశానికి వేల మైళ్ల దూరంలో వున్నా పుట్టిన గడ్డపై మమకారంతో ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రాజన్‌రాజు, బొక్కా వెంకట రామకృష్ణలు భీమవరం మండలం కొవ్వాడకు చెందిన కలిదిండి రాజన్‌రాజు అమెరికాలో ఒక సాఫ్ట్‌వేర్‌ సంస్థకు ఎండీ. ఆ సంస్థ పేరు వర్టూస. అక్కడే స్ధిరపడినా మాతృభూమిపై మమకారంతో ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నలుగురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

 

కొవ్వాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లు, సైన్స్‌పరికరాలు ఇలా అనేక కార్యక్రమాలకు రూ.15లక్షల వరకు ఖర్చు చేశారు. తీర గ్రామాలైన దొంగపిండి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు కింద కూర్చుని విద్యనభ్యసిస్తున్నారనే విషయం తెలుసుకుని రూ.4లక్షల ఖర్చుతో బెంచీలను సమకూర్చారు. గూట్లపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రూ.5లక్షలు ఖర్చు చేసి బెంచీలు, కిటికీలు, వేదికను నిర్మింపజేశారు. పలు పాఠశాలల్లో తాగునీటి సౌకర్యాన్ని సైతం కల్పించారు.

Image result for nri

 

పేదవృద్ధులకు ఆర్థికసాయం.. 
వీరవాసరం మండలం కొణితివాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యనభ్యసించిన బొక్కా వెంకటరామకృష్ణ ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడ్డారు. ఆయన 2007 నుంచి గ్రామంలో పేదలైన వృద్దులకు ఒక్కొక్కరికి రూ.100లు చొప్పున ప్రతి నెలా ఆర్థిక సహాయం చేస్తున్నారు. అప్పట్లో అలా 8 మందికి ప్రారంభించిన సహాయం కాస్తా ప్రస్తుతం 50 మందికి చేరింది. అంటే నెలకు సుమారుగా రూ.5వేలు పేద వృద్ధులకు సహాయమందిస్తున్నాడు. తాను చదువుకున్న పాఠశాలలో చుట్టుపక్కల నుంచి వచ్చే విద్యార్థులు సైకిళ్లు పెట్టుకునేందుకు వీలుగా ఇటీవల రూ.2.50లక్షలు ఖర్చు చేసి సైకిల్‌షెడ్‌ నిర్మాణం చేశారు. గ్రామంలో ఉన్న పరిస్థితులపై అక్కడ ఉన్న తన చిన్ననాటి మిత్రుడు కాళ్ల సత్యనారాయణ ద్వారా తెలుసుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: