అమెరికాలోని మెంఫిస్‌లో టామ్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో, ఐసీసీటీలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో కన్నుల పండువ బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఐఏఎమ్ ఇండియాఫెస్ట్ ఉత్సవాల్లో ఇండియన్ బాలే థియేటర్ కళాకారులు పలు అన్నమయ్య సంకీర్తనలకు అందమైన నృత్యాలను ప్రదర్శించారు. అశ్విక బండారు, నిధి నిహారిక చెన్నం, వైష్ణవి పిల్లి, అస్మితరెడ్డి బొడ్డు, సహస్ర ససిపల్లి, నైధ్రువా మెనోతురాంబిల్, సహస్ర తోట, ఈషా సూరిశెట్టి, శ్రీజ సూరిశెట్టి, శైలిక పగడాల, పర్ణిక పగడాల, రితిక పాగల, మేఘన బలభద్రుని, యోగిత మానస డింతకుర్తి, శాన్వి కుంటమల్ల, సాహతి అన్నే, రశ్మిత బయ్యన, చంద్రప్రభ వాసిలి రంగుల హరివిల్లులా ఆద్యంతం చక్కనైన లయవిన్యాసాలతో శోభనీయమైన అలంకరణతో ప్రదర్శించారు.
ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కూచిపూడి నాట్య నిష్ణాతులు డా.రమణ వాసిలి అన్నమయ్య పాదాలకు నృత్య రచన చేసి ప్రదర్శనకు దర్శకత్వం వహించారు. దాదాపు ఎనిమిది వందలకు పైగా తెలుగువారు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని కళాకారులను అభినందించారు. ఇండియన్ బాలే థియేటర్‌లో డా. రమణ వాసిలి, చంద్రప్రభ వాసిలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రదర్శితమైంది.