ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్లో తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా సంబరాలు నిర్వహించనున్నారు. ఉత్తర ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్, టీసీఎస్ఎన్ఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తేదీన వీటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. బెల్ఫాస్ట్ సిటీ హాల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో ప్రముఖ గాయని గాయకులు శ్రీకృష్ణ, అంజనా సౌమ్య తెలుగు పాటలతో అందరిని అలరించనున్నారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, శాస్త్రీయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్ఫాస్ట్ మేయర్ హాజరకానున్నారు.