ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) నూతన అధ్యక్షుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామానికి చెందిన తాళ్లూరి జయశేఖర్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థిపై 9,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. శనివారం రాత్రి వెలువడిన ఈ ఫలితాలు భద్రాచలం ప్రాంతంలో ఆనందోత్సాహాలు నింపాయి. ఇప్పటివరకు తానాకు అనుబంధంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న తానా ఫౌండేషన్‌కు జయశేఖర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.