![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/nri/auto_videos/isi -415x250.jpg)
హిందూ మతం నుంచీ ఇస్లాం కి
మారిన భారత సంతతికి చెందిన సిద్ధార్ద్
దార్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమరికా ప్రకటించింది తానూ మతం మారిన తరువాత
అబూ రుమైసాగా పేరు మార్చుకున్నాడు..అయితే సిద్దార్ద్ ని ఇప్పుడు 'న్యూ జిహాదీ జాన్'గా పిలుస్తున్నారు...అంతేకాదు అతడు ఇప్పుడు ఐసిస్‌లో సీనియర్ కమాండర్‌గా మారినట్లు పలు
పత్రికలు కథనాలు వెల్లడించాయి. నిహాద్ బరకత్ అనే యాజిదీ బాలిక తనను సిద్ధార్థ్
ధార్ అపహరించి మానవ అక్రమ రవాణా చేశాడని తెలిపినట్లు ఇండిపెండెంట్ పత్రిక
వెల్లడించింది.
ఇదిలా ఉంటే సిద్దార్ద్ దార్ తో పాటుగా సిద్ధార్థ్ థార్‌తో పాటు బెల్జియన్-మెరాకన్ పౌరుడైన అబ్దెలతీఫ్ గైనిలను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది..అంతేకాదు వారిపై కొన్ని ఆంక్షలు కూడా విధించింది..సిద్ధార్ “2014” లోనే భార్య పిల్లలతో కలిసి యూకే వదిలి సిరియాకు వెళ్లి ఐసిస్‌లో చేరినట్లు అమెరికాకి సమాచారం ఉంది అని తెలుస్తోంది.
అయితే ఇప్పుడు ఈ ఇద్దరు ఉగ్రవాదుల నుంచీ ముప్పు పొంచి ఉందని అమెరికా తమ దేశంతో పాటుగా అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరించింది..ఐసిస్ లో జిహాదీ జాన్ గా పిలిచే జిహాదీ జాన్‌గా పిలిచే మొహమ్మద్ ఎమ్వాజి స్థానంలో సిద్ధార్థ్‌ను నియమించినట్లు తెలుస్తోంది... 2015లో జరిపిన దాడుల్లో మొహమ్మద్ ఎమ్వాజీ మరణించిన విషయం అందరికీ తెలిసిందే..అయితే 2016 జనవరలో ఐసిస్ విడుదల చేసిన వీడియోలో ముసుగుతో కనిపించిన ఉగ్రవాది అబూ రుమైసా అని భావిస్తున్నారు...ఏది ఏమైనా సరే దేశ ప్రజలు అన్ని దేశాలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని అంటున్నారు అమెరికా నిఘా వర్గాలు..