అమెరికాలో తెలుగు వారికోసం ఎన్నో సంఘాలు
ఏర్పడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు లెక్కకి
మించిన తెలుగు సంఘాలు అమెరికాలో ఉన్నాయి. ఏ సంఘం కొత్తగా ఏర్పడినా సరే అందరూ
తెలుగు వారికి సహాయ సహకారాలు అందించడం. ఆపదలో ఉన్న వారికి సాయం అందించడం, మొదలగు సేవా కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు.
అయితే అమెరికాలో తెలుగు మహిళల కోసం ప్రత్యేకంగా ఓ సంఘాన్ని టాటా మాజీ అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఏర్పాటు చేశారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ పేరుతో ఈ సంఘాన్ని ఆమె ఉమెన్స్ డే రోజున ప్రకటించారు. ఇది తెలుగు మహిళల కోట అని, స్త్రీ ప్రగతి పథమే మా బాట అని కూడా ఆమె లోగోలో పేర్కొన్నారు.
ఇదిలాఉంటే ఈ సంఘానికి అడ్వయిజరీ కౌన్సిల్ చైర్, ప్రెసిడెంట్ కూడా అయిన ఝాన్సీరెడ్డి ఈ సంఘం ద్వారా మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి చాటుతామన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఇప్పుడు ఉంటున్న తెలుగు సంఘాలలో తగు న్యాయం జరగడం లేదని అందుకే కొత్తగా కేవలం మహిళల కోసమే ఈ కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశామని ఝాన్సీ రెడ్డి తెలిపారు.