అమెరికాలో చదువుకుని అక్కడే స్థిరపడి మంచి భవిష్యత్తుతో తమ తల్లి తండ్రులని చూసుకోవాలని అనుకున్న ఓ విద్యార్ధి కల నెరవేరకుండానే తనువు చాలించాడు. అతడిని సముద్రపు అలలు మృత్యువు ఒడిలోకి తీసుకువెళ్తాయని ఊహించి ఉండడు కాబోలు స్నేహితులతో సరదాగా సముద్రపు స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డాడు. వివరాలలోకి వెళ్తే..
తెలంగాణా రాష్టం మంచిర్యాల జిల్లాకి చెందిన శ్రావణ్ కుమార్ 2014లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్ళాడు. అక్కడ పీజీ చదువుతూనే ఉద్యోగం చేస్తున్న శ్రావణ్.ఈస్టర్ వేడుకల సందర్భంగా స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న బీచ్ కి వెళ్ళాడు..అయితే
అక్కడి ఒక్క సారిగా ఉవ్వెత్తున అలలు ఎగసి పడటంతో అతడు సముద్రంలో గల్లంతయ్యాడు. వెంటనే అక్కడే ఉన్న స్నేహితులు భద్రతా సిబ్బందికి సమాచారం అందించినా సరే ఫలితం లేకపోయింది. ఆ తరువాత రోజు శ్రవణ్ మృతదేహం సముద్రంలో తేలి ఆడటంతో అతడు చనిపోయిన ఆ సమాచారాన్ని తన తల్లి తండ్రులకి వెల్లడించారు.