గల్ఫ్ దేశం దుబాయ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రంజాన్ హాలిడేస్ తర్వాత ఒమన్ నుంచి దుబాయ్ వస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మొత్తం 17 మంది చనిపోయారు. అందులో 8 మంది కేరళవాసులు ఉన్నట్లు గుర్తించారు. వారి బంధువులకు సమాచారం అందించారు. దుబాయ్ లోని భారత ఎంబసీ చనిపోయిన, గాయపడ్డ వారి వివరాలను కుటుంబ సభ్యులకు చేరవేసింది.
ఈ బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి భారత రాయబార కార్యాలయం సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిని స్థానికంగా ఉన్న రషీద్ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేస్తున్నారు. భారతీయ రాయబార కార్యాలయం ద్వారా బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించి తగు చర్యలు చేపట్టింది.