అమెరికాలోని గ్లెన్‌ ఓక్స్‌ ప్రాంతంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఓ హిందూ పూజారిపై దాడి చేశాడు. విచక్షణా రహితంగా కొట్టాడు. దాడి చేసిన సమయంలో ఇది మా ప్రాంతం అంటూ ఆ వ్యక్తి నినాదాలు చేసినట్టు తెలుస్తోంది.


వివరాల్లోకి వెళ్తే.. శివశక్తి పీఠం పూజారి హరీశ్ చందర్ పూరీపై సెర్జియా గువెయ అనే 52 ఏళ్ల స్థానికుడు దాడి చేశాడు. హరీశ్ చందర్ పీఠానికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. పూజారి వెనుకనుంచి వచ్చిన దుండగుడు విచక్షారహితంగా కొట్టాడు.


దుండగుడి దాడిలో హరీశ్ చందర్ పూరీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పూజారిపై దాడికి పాల్పడిన సెర్జియా గువెయ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: