అదృష్టం ఏ సమయంలో ఎవరిని ఎలా, ఎప్పుడు వరిస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్కో సారి ఎవరూ ఊహించని విధంగా లక్కు కలిసి వస్తుంది. ఈ లక్కు వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంది. ఇప్పుడు ఇలాంటి అదృష్టమే నిజామాబాద్ కి చెందిన విలాస్ అనే డ్రైవర్ ని వరించింది. కారు డ్రైవర్ గా పని చేస్తున్న విలాస్ ఈ ఊహించని పరిణామంతో ఉబ్బితబ్బిబ్బై పోతున్నాడు. వివరాలలోకి వెళ్తే..

 Image result for dubai lottery

కొన్నేళ్ళుగా దుబాయ్ లో కారు డ్రైవర్ గా పని చేసిన విలాస్ అక్కడ ఉన్న క్రమంలో లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసేవాడు.  ఎన్నో సార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా సరే ఫలితం ఉండేది కాదు. అయితే తన కుటుంభానికి దూరంగా ఉండే కంటే ఇండియా వెళ్ళిపోతే అక్కడే అందరికి దగ్గరగా ఉండచ్చు అనుకున్న విలాస్  సొంత ఊరు వచ్చేసి ఇక్కడే కష్టాలు పడుతున్నాడు. అయినా సరే

 Image result for dubai lottery

అతడు దుబాయ్ లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేయడం మానలేదు.  ఈ క్రమంలోనే ఒక రోజు తన వద్ద డబ్బులు లేకపోయినా సరే తన భార్య నుంచీ డబ్బులు తీసుకుని మూడు లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశాడు. ఈ సారి అదృష్టం గట్టిగా విలాస్ ని పట్టుకుంది కొనుగోలు చేసిన మూడు టిక్కెట్ల లో ఒక టిక్కెట్టు కి దాదాపు 28 కోట్లు వచ్చింది. దాంతో అతడి భార్య, ఇద్దరు ఆడ పిల్లల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇదంతా తన భార్య వల్ల వచ్చిన అదృష్టం అంటూ ఉప్పొంగి పోతున్నాడు విలాస్.

 


మరింత సమాచారం తెలుసుకోండి: