
మృత్యువు ఎప్పుడు, ఎటు
నుంచీ వస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్క సారిగా ఊహించని విధంగా కబళిస్తుంది. అప్పటి
వరకూ సంతోషంగా ఉండే వ్యక్తి కళ్ళముందే చనిపోయిన పరిస్థితులు కోకొల్లలు. ఇలాంటి సంఘటనే
అమెరికాలో చోటు చేసుకుంది. తన ఉద్యోగ పని వేళలు ముగించుకుని ఇంటికి తిరిగి
వస్తున్నా షార్లెట్ నగరంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తెలుగు ఎన్నారై అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలలోకి
వెళ్తే...
చిత్తూరు జిల్లా మిరియం గంగానపల్లికి చెందిన వివేక్ అనే వ్యక్తి అమెరికాలోని నార్త్ కరేలిన యూనివర్సిటీ లో ఎంటెక్ చేస్తున్నాడు. శుక్రవారం నాడు తన పార్ట్ టైం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ప్రాణాలు విడిచాడు.
వివేక్ మృతి విషయం అక్కడి స్నేహితులు , వివేక్ తల్లి తండ్రులకి భందువులకి సమాచారం ఇవ్వడంతో వారి కుటుంభం విషాదంలో నిండిపోయింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన కొడుకు ఇక లేడని తెలియడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. వివేక్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు స్నేహితులు.