
అమెరికాలో మరో తెలుగు ఎన్నారై మృతి
చెందారు. రెండు రోజుల క్రితం ఎపీలోని చిత్తూరు జిల్లా కి చెందిన వివేక్ అనే
వ్యక్తి వ్యక్తి మృతి చెందిన వార్త మరువక ముందే, తాజాగా జరిగిన ఈ ఘటన తీవ్ర
విషాదాన్ని నింపింది. ఎన్నో ఆశలతో ఏపీ నుంచీ అమెరికా వెళ్లి అమెరికాలో ఉద్యోగం సాధించి సంతోషంగా ఉన్న అతడి జీవితం
నిన్నటితో ముగిసి పోయింది. వివరాలలోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకి చెందిన శివతేజ అనే వ్యక్తి ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళాడు. ఆకున్నట్టుగానే ఉద్యోగం సంపాదించాడు. కుటుంభ సభ్యులు కూడా అతడికి ఈ ఏడాది పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. అందరి ఆసలని అడియాసలు చేస్తూ నిన్నటి రోజున రోడ్డు ప్రమాదంలో శివతేజని మృతువు కబళించింది. ఆఫీస్ ముగించుకుని కారులో తన స్నేహితులతో ఇంటికి వెళ్తున్న సమయంలో
ఒక్కసారిగా అదుపుతప్పిన కారు వేగంగా డివైడర్ ని ఢీ కొట్టింది. దాంతో కారు పల్టీలు కొట్టి ఆగిపోయింది. కారులోని వారు అందరూ గాయాల పాలవ్వగా, కారు నడుపుతున్న శివతేజ మాత్రం రక్త శ్రావంతో కూడిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే శివతేజ మరణించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సన్నిహితులు అమెరికాలోనే ఉంటున్న ఆమె సోదరికి, ఏపీలో ఉంటున్న తల్లి తండ్రులకి తెలియచేశారు.