విదేశాలలో ఉంటున్న ఎన్నారైల
కి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎన్నారైలకి ఆధార్ కార్డ్ అందనంత దూరంలో
ఉండటంతో, ఎన్నారైలు ఆధార్ విషయంలో
నిభందనలు మార్పు చేయాలని గతంలో కేంద్రానికి ఎన్నో ఆర్జీలు పెట్టుకున్నారు. దాంతో కేంద్రం ఈ విషయంపై స్పందించింది. త్వరలోనే ఆధార్
విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నట్టుగా తెలిపింది. వివరాలలోకి వెళ్తే..
భారత్ లో ప్రతీ చిన్న పనికి ఆధార్ తప్పని సరి అనే విషయం అందరికి తెలిసిందే. ప్రభుత్వంతోనో, లేక ప్రవైటు వ్యవహారాలలో తప్పనిసరిగా ఆధార్ ఉండాల్సిందే.లేదంటే ఆ పని అక్కడితో ఆగిపోతుంది. ఈ క్రమంలో విదేశాలలో ఉంటున్న భారత ఎన్నారైలు తమ ఆర్ధిక లావాదేవీలు ఇండియాలో జరపాలన్నా ఆధార్ తప్పని సరి కావడంతో ఆధార్ పొందేందుకు ఎన్నో కష్టాలు పడుతున్నారు.
విదేశాలలో ఉండే భారత ఎన్నారైలు ఆధార్ కార్డ్ పొందాలంటే తప్పకుండా వాళ్ళు భారత్ లో 180 రోజులు ఉండాల్సిందే అనే నిభందన ఉంది. దీనివల్ల సెలవలు దొరకక ఎంతో మంది ఎన్నారైలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే తమ పరిస్థితులని పరిగణలోకి తీసుకోవాలని గత కొంతకాలంగా ఆర్జీలు పెట్టుకుంటున్న సమయంలో కేంద్రం స్పందించింది. త్వరలోనే ఈ నిభంధనలని సడలించి కొత్త మార్గ దర్సకాలు విడుదల చేయాడానికి కసరత్తులు చేస్తోందని తెలుస్తోంది.