
అమెరికాలో ఓ ఇండో అమెరికన్
చేసిన దొంగతనం స్టొరీ వింటే తెలుగు సినిమాలో రవితేజ కిక్ సినిమా గుర్తుకు
రాకమానదు. ఇక్కడ సినిమా చూసిన జనాలు ఎలా నోళ్ళు వెళ్ళబెట్టారో, అమెరికా పోలీసులు కూడా
అలాగే నోళ్ళు వెళ్ళబెట్టారట. ఇంతకీ ఆ కిక్ స్టొరీ పై ఓ లుక్కేద్దాం. అమెరికాలో
ఉండే చావ్లా ట్రంప్ హోటల్ వ్యాపారంలో భాగస్వామి. డబ్బుకి కొదవలేదు. కానీ
అమెరికాలోమంఫిస్ ఎయిర్పోర్ట్ లో ఓ సూట్కేస్ దొంగిలిచి కటకటాల పాలయ్యాడు.
చావ్లా హోటల్స్ కి సీఈవో గా ఉన్నతమైన వ్యక్తిగా పేరొందారు. గత వారం అమెరికాలోని మంఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాగేజ్ నుంచీ లగేజ్ తీసుకుంటూ సీసీ కెమెరా కంట పడ్డారు. సూట్ కేసు కొట్టేసి మరొక విమానం ఎక్కాలని కారులో లగేజీ తీస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వాహనాన్ని తనికీ చేయగా అందులో వేరొక సూట్కేసు ఉండటం గమనించారు.
అంతేకాదు నెలరోజుల క్రితం ఆయన వీటిని ఎత్తుకు వెళ్ళారని పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా అయన ఈ రెండు బ్యాగ్ లో దొంగిలించినట్టుగా ఒప్పుకున్నారు. అయితే ఈ దొంగతం ఎందుకు చేసినట్టు మీకు డబ్బులకి లోతులేదు కదా అన్న పోలీసుల ప్రశ్నలకి ఆయన చెప్పిన సమాధానం విని వారికి దిమ్మ తిరిగిపోయిందట. ఈ దొంగతనం కిక్ కోసం చేశా, ఇలా చేస్తే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుందని అంటూ బదులు ఇచ్చాడట ఆ పెద్ద మనిషి..