అమెరికాలో రోజు రోజుకి భారతీయులపై
దాడులు పెరిగిపోతున్నాయి. అమెరికాలో ఉండే ప్రవాస భారతీయులలో అధిక సారం సిక్కులనే
టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి. గతంలోనే ఓ సిక్కు వ్యక్తిని చంపిన
ఘటన, అదే విధంగా మరొక సిక్కు వ్యక్తిని కొట్టిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే
అమెరికాలో ఉంటున్న సిక్కు పౌరులు ఈ దాడులని తీవ్రంగా నిరసిస్తూ ధర్నా కూడా
చేపట్టారు.
ఇప్పటి వరకూ జరిగిన ఈ
దాడులు జాత్యహంకార దాడులుగానే పరిగణించారు సిక్కు నేతలు. పోలీసులు కూడా ఇవి
జాత్యహంకార దాడులే అని చెప్పారు కూడా. ఇదిలాఉంటే తాజగా అమెరికాలో జరిగిన సిక్కు వ్యక్తి
హత్య అత్యధికంగా ఉన్న సిక్కు పౌరులని
కంగారు పెట్టిస్తోంది.
గడిచిన రాత్రి తొమ్మిది గంటల సమయంలో గ్రెచెన్ ట్రాలీ పార్క్ లో వాకింగ్ చేస్తున్న పరంజిత్ సింగ్ అనే గుర్తు సిక్కు వ్యక్తిని, ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాంతో తీవ్ర గాయాల పాలైన అతడిని స్థానికులు గుర్తించి పోలీసులకి సమాచారం అందించి ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ పరంజిత్ ప్రాణం వదిలారు. అయితే ఇది విద్వేష పూరిత హత్య కాదని, ఈ కేసుపై విచారణ ప్రారంభించామని పోలీసు అధికారులు తెలిపారు.