ఎట్టకేలకి
భారత ఎన్నారైలు చాలా రోజుల తరువాత ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు. గత కొంత కాలంగా
హెచ్ -1 బీ వీసా దారులు తమ జీవిత భాగస్వాముల విషయంలో పడుతున్న అందోళనకి కొంత కాలం
వరకూ కలవర పడకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఓ కీలక ప్రకటన
చేసింది. హెచ్ -4 వీసా రద్దు విషయంలో వచ్చే
ఏడాది వరకూ కూడా రద్దు విధించబోమని తెలిపింది.
ఈ విషయంపై అమెరికాలో ఉంటున్న భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విధానం పూర్తిగా ఎత్తి వేస్తే మరింత ఊరట కలుగుతుందని అమెరికా ప్రభుత్వాని కోరుకుంటున్నారు. ఎందుకంటే. అమెరికాలో హెచ్ -4 వీసా ద్వారా ప్రవేశించిన వారిలో అత్యధికులు భారతీయులే. హెచ్ -1 బీ వీసా ఉన్న వారి జీవిత భాగస్వాములని అమెరికాలోకి ప్రవేశించేందుకు వీలుగా ఏర్పాటు చేసినదే హెచ్ -4 వీసా
2015 లో అప్పటి అధ్యక్షుడు ఒబామా హెచ్ -1 బీ వీసా దారులకోసం హెచ్ -4 వీసాని ప్రవేశపెట్టారు. దాంతో అమెరికాలో ఉంటున్న స్థానిక ప్రజలకి ఉద్యోగాలలో తీవ్ర అన్యాయం జరుగుతోందని, వారు తీవ్రంగా నష్టపోతున్నారని ట్రంప్ ప్రభుత్వం ఈ వీసా పై నిషేధం విధించాలని కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకుని. కానీ డెమోక్రాటిక్ పార్టీ నేతలు, ఎంతో మంది భారతీయుల పై ఆధారపడి నడుస్తున్న సంస్థలు ఆర్జీలు పెట్టడంతో ఈ ఏడాది వరకూ హెచ్ -4 వీసాపై ఎటువంటి నిర్ణయం ఉండదని ప్రకటించింది.