
అమెరికాలో వచ్చే ఏడాది
జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ట్రంప్
ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవకూడదని డెమొక్రాట్స్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టుగానే మరోకొంత
మంది సైతం ట్రంప్ ఓటమి కోసం ఆరాట పడుతున్నారు. ఈ మేరకు ఇరాన్ కి చెందిన కొందరు
హ్యాకర్స్ పని చేస్తున్నారని తెలుస్తోందని సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలిపింది.
ఈ సారి ఎన్నికల్లో ట్రంప్ ఓటమే ధ్యేయంగా ఇరాన్ హ్యాకర్స్ పని చేస్తున్నారని ప్రకటించడం సంచలనం సృష్టించింది. వీరు ట్రంప్ ప్రచారాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనుమానం వ్యక్తం చేసింది. అయితే మైక్రోసాఫ్ట్ చేసిన ఈ ఆరోపణలకి ఇప్పటి వరకూ ఇరాన్ స్పందిచలేదు. అయితే మైక్రోసాఫ్ట్ ఆరోపణలపై స్పందించిన ట్రంప్ ప్రతినిధి ఒకరు తమకి ఇప్పటి వరకూ టెక్నికల్ గా ఎలాంటి హెచ్చరికలు రాలేదని ప్రకటించారు.
ఇటీవల కాలంలో పాస్పరస్ పేరుతో కొంతమంది సమూహం అమెరికాకి చెందిన సైనిక అధికారులు మాజీ అమెరికా అధికారులు, జర్నలిస్టులు ఇలా సుమారు 241 ఖాతాలని హ్యాక్ చేయడానికి 2700 సార్లు ప్రయత్నాలు చేశారని. అయితే వారు ఇరాన్ హ్యాకర్స్ అయి ఉంటారని తెలిపింది. త్వరలో వీటికి సైతం బదులు ఇస్తామని ట్రంప్ ప్రతినిధి తెలిపారు. మేము మరింత కట్టుదిట్టంగా ఉంటామంటూ ప్రకటించారు.