అమెరికాలో భారతీయుల ఎంతో మంది ఉన్నత స్థానాలలో కొలువుదీరి ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వ హయంలో సైతం భారతీయులకి కీలక పదవులే అప్పగించారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక ఇండో అమెరికన్ అయిన సంపత్ శివంగి కి అత్యున్నతమైన పదవిని అప్పగిస్తూ కీలక  ఆదేశాలు జారీ చేశారు ట్రంప్. వివరాలలోకి వెళ్తే.

 

అమెరికా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ లోకి సంపత్ శివంగి ని తీసుకుంటున్నట్టుగా ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా హెల్త్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ తెలిపారు. ఈ మేరకు సంపత్ కి భాద్యతలు అప్పగిస్తున్నట్టుగా ఆదేశించారు. ఇందులోనే మెంటల్ హెల్త్ అడ్వైజరీ కమిటీ కూడా ఉంటుంది. సంపత్ శివంగి సేవలని ఇందులో సైతం వినియోగించుకోనున్నారని అలెక్స్ తెలిపారు.

 

ఇదిలాఉంటే ట్రంప్ తనకి ఈ కీలక భాద్యతలు అప్పగించడం పట్ల సంపత్ శివంగి కృతజ్ఞతలు తెలిపారు. అయితే గతంలో సంపత్ శివంగి మిసిసిపీ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ మెంటల్ హెల్త్ చైర్మెన్ గా కూడా వ్యవహరించారు. అంతేకాదు జార్జ్ బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ హ్యూమన్ సర్వీసెస్ కి అడ్వైజరీ గా కూడా సేవలు అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: