కొన్ని కొన్ని ప్రదేశాలు చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. స్వర్గం అనేది ఇక్కడే ఉందా అనేసి అప్పుడప్పుడు డౌట్ కూడా వస్తూ ఉంటుంది. ఆగ్రా లోని తాజ్ మహల్ ని చూసినప్పుడు, పారిస్ లోని ఈఫిల్ టవర్ చూసినప్పుడు ఇలాంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఇలాంటి ఒక అనుభూతే ఇప్పుడు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గిటార్ అనే హోటల్లో నెలకొంది అని అంటున్నారు అక్కడి ప్రజలు.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో హాలివుడ్లో అత్యంత విశాల విలాసవంతమైన ‘గిటార్’ హోటల్ గురువారం రాత్రి హాలివుడ్ సెలబ్రిటీల కోలాహాలం మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అచ్చం గిటార్ ఆకృతిలో నిర్మించిన ఈ హోటల్లో ఏడు వేల సీట్లు కలిగిన కాసినో ఫ్లోర్, 1200 హోటల్ గదులు, మూడులేవ పండ్లు, ఫలహారాల మిషన్లు ఉన్నాయి.
ఈ గిటార్ హోటల్ ప్రారంభోత్సవానికి క్లూ కర్దాషియన్,
జానీ డెప్, మోర్గాన్ ఫ్రీమన్, సోఫి రిచీ తదితర సెలబ్రిటీలు హాజరయ్యారు. దక్షిణ ఫ్లోరిడాలో సెమినోల్ ట్రైబ్కు చెందిన ప్రజలు 4,200 మంది ఉన్నారు. ఈ గిటార్ హోటల్ యొక్క ఖరీదు సుమారు 10,000 కోట్ల దాక ఉంటుంది .600 గదులతో పాటు, 42,000 చదరపు అడుగుల సెలూన్, రిటైల్ షాపులు, రెస్టారెంట్లు మరియు గేమింగ్, ఈ హోటల్ కచేరీ వేదికను కలిగి ఉంది ఇది మెరూన్ 5, స్టింగ్ మరియు బిల్లీ జోయెల్ వంటి కార్యక్రమం నిర్వహిస్తుంది.
అక్కడ నివాసం ఉంటున్న ఒక్క వ్యక్తి మాట్లాడుతూ "ఇది నమ్మశక్యం కాదని నేను భావిస్తున్నాను, ఇది సరదాగా ఉంది, ఇది భిన్నమైనది, ఇది ఉత్తేజకరమైనది, ఇది పాప్ సంస్కృతి. ఇది కళ మరియు కటాడని ఆనందించేలా చేస్తుంది అని నేను అనుకుంటున్నాను" .ఈ హోటల్ భూలోక స్వర్గం అవుతుందని యాజమాన్యం చెబుతోంది.