ఈ మధ్యకాలంలో భారతీయులపై కేసులు ఎక్కువ అయిపోయాయి. ఎక్కడికి వెళ్లిన వారిపై రోజుకు ఒక కేసు అయినా నమోదు అవుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే జర్మనీలో నివసిస్తున్న ఓ భారతీయ జంటను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ దంపతులు ఇద్దరు స్థానికంగా నివసిస్తున్న భారతీయుల సమాచారాన్ని. 

 

కాశ్మీర్ విషయంలో వారి ప్రవర్తనను భారత్ నిఘా సంస్ద రా 'రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్'కు షేర్ చేరవేశారనేది వారి ఆరోపణ. ఇంకా వివరాల్లోకి వెళ్తే భారత్‌కు చెందిన మన్మోహన్ అనే 50 ఏళ్ళ వ్యక్తి, కమల్ జీత్ దంపతులు జర్మనీలో జీవిస్తున్నారు. వీరిద్దరూ 2017లో జూలై-డిసెంబర్ మధ్య కాలంలో ‘రా’కు సంబంధించి ఓ అధికారితో ఎన్నో సార్లు సమావేశమయ్యారని, స్థానికంగా ఉన్న భారతీయులు, మరీ ముఖ్యంగా సిక్కుల వ్యక్తిగత వివరాలను ఆ అధికారికి చేరవేశారని జర్మనీ పోలీసుల వాదిస్తున్నారు.

 

అయితే దీనికోసం ఈ దంపతులు 'రా' నుంచి దాదాపు రూ.5.8లక్షల డబ్బు తీసుకున్నారని వారు తెలిపారు. కాగా ప్రస్తుతం జర్మనీలో 10 నుంచి 20 వేల మంది సిక్కు మతస్థులు నివశిస్తున్నారు. వీరందరికీ సంబంధించిన సమాచారాన్ని మన్మోహన్ దంపతులు 'రా'కు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 

 

మరో వైపు వీరిపై గురువారం ఇక్కడి ఫ్రాంక్‌ఫర్డ్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. మరి ఈ కేసుకు సంబంధించి నిజాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. నిజంగానే వారు సమాచారాన్ని అందచేశారా ? లేదా అనేది తెలియాల్సి ఉంది. 

                                                                          

మరింత సమాచారం తెలుసుకోండి: