అమెరికా.. ఇది అవకాశాల స్వర్గంగా చెప్పుకుంటారు. చదువు, ఉద్యోగం, ఉన్నత జీవనం.. ఇలా పలు కారణాలతో అమెరికాకు విదేశాల నుంచి వలసలు ఉంటాయి. అయితే విద్యార్థుల విషయంలో.. అత్యధికంగా చైనా నుంచి విద్యార్థులు అమెరికా వెళ్తున్నారట.

 

ఇక చైనా తర్వాత ఆ దేశానికి వెళ్లే విద్యార్థుల్లో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారట. గత దశాబ్దకాలంగా ఇదే సంప్రదాయం కొనసాగుతోందట. ‘2019 ఓపెన్‌ డోర్స్ రిపోర్ట్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ ఎక్స్ఛేంజ్‌’ నివేదిక ప్రకారం 2018-19 విద్యా సంవత్సరంలో 10లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు అమెరికాకు వెళ్లారు.

 

ఇలా వెళ్లిన వారిలో 3.69లక్షల మంది చైనా వారు. ఇండియన్స్ 2,02,014 మంది. గత సంవత్సరంతో పోలిస్తే చైనా విద్యార్థుల సంఖ్య 1.7శాతం పెరిగితే... భారత విద్యార్థుల సంఖ్య 2.9శాతం పెరిగిందట. బంగ్లాదేశ్‌, బ్రెజిల్‌, నైజీరియా, పాకిస్థాన్ నుంచి విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతుందట.

 

అమెరికాలో గణితం, కంప్యూటర్‌ విద్య చదువుతున్న వారి సంఖ్య 9.4శాతం పెరిగిందట. తరువాతి స్థానంలో ఎంబీఏ ఉందట. అమెరికా వెళుతున్న విదేశీ విద్యార్థుల్లో 21.1శాతం మంది ఇంజినీరింగ్‌ వైపు మొగ్గుచూపుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: