ప్రతిభ ఉన్న చోట తప్పకుండా పట్టం కడుతారు. అందుకు ఎవరి రాయబారాలో, కాకి కబుర్లో అక్కర్లేదు. కానీ ఆ ప్రతిభని గుర్తించి పట్టుకోవడంలోనే  ఉంటుందని అసలు విషయం అంతా. అమెరికా ఎందుకు అంతగా అభివృద్ధి చెందింది అంటే అందుకు కారణం లేకపోలేదు. దేశ విదేశాలలో ప్రతిభగల వారు, ఉన్నా తమ దేశ అభివృద్దికి వారు ఉపయోగపడుతారని అనుకున్నా వదులుకోవడానికి అమెరికా ఒప్పుకోదు, అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసాల జారీ విషయంలో కేవలం ప్రతిభావంతులకే అంటూ కండిషన్లు పెట్టారు.

Image result for 3 iit student got 1.54 cr package

అందుకే అమెరికా కంపెనీలు భారత్ లో అత్యంత ప్రతిభగల నిపుణులు భవిష్యత్తు నిపుణుల కోసం విద్యార్ధుల కోసం జల్లెడలు పడుతోంది. వివరాలోకి వెళ్తే. అమెరికాకి చెందిన 30 ఐటీ ఎమ్మెన్సీ కంపెనీలు భారత్ లోని ఐఐటీ రూర్కీ లో క్యాంపస్ ఇంటర్వ్యూ లు జరిపాయి. అందులో సుమారు  363 మంది విద్యార్ధులు పాల్గొనగా 322 మంది ఎంపిక అయ్యారు. వీలో రెండు అంతర్జాతీయ కంపెనీలు ముగ్గురు విద్యార్ధులకి బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ఈ ముగ్గురు విద్యార్ధుల ప్రతిభకి మైమరచిన కంపెనీ ఒక్కొక్కరికి వార్షిక వేతనం

 

సంవత్సరానికి 1. 54 కోట్లుగా ప్రకటించి వారిని అమెరికా తన్నుకుపోయింది. ఒక్కొక్కరికి భారీ వేతనం ఇచ్చాయంటే వారిలో ఎంతటి ప్రతిభ దాగుందో ఆ కంపెనీలు వారిలో భవిష్యత్తు నిపుణులని ఎంతగా గుర్తించాయో అర్ధం చేసుకోవచ్చు.  అలాగే మరో కొంతమంది విద్యార్ధులు వార్షిక వేతనం 62 లక్షలతో ఎంపిక అయ్యారు. ఇదిలాఉంటే ఇప్పటి వరకూ 1. 54 కోట్లుగా వార్షిక వేతనంతో ముగ్గురు ఎంపిక కావడం ఐఐటీ చరిత్రలో ఇదే ప్రధమమని అంటున్నారు ఐఐటీ నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: