అసలు ఈ ఘటనను ఎం అని చెప్తం ? ఎంత అని చెప్తం.. ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా లోకంలో అనే సందేహాన్ని తెస్తున్నాడు. ఇలాంటి లోకంలో మనం బతుకుతున్నామా ? ఛీ !అని మనపై మనకే అసహ్యం తెచ్చేలా ప్రవర్తించాడు. కన్నకూతురిని 500 రూపాయలకు అమ్మేశాడు ఈ కసాయి తండ్రి. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్‌లో కన్నకూతురిని కసాయి వాడికి అమ్మేసిన దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి ఇంట్లో లేని సమయంలో తన భర్త ఎవరో వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చారని వ్యక్తి దగ్గర తన భర్త రూ. 500 తీసుకుని తన 12 ఏళ్ల కూతురిని అతడికి అప్పగించాడని బాలిక తల్లి వాపోయింది. 

 

అంతేకాదు ఆ బాలికను కొన్న వ్యక్తి ఆబాలికపై అత్యాచారానికి ప్రయత్నించడంతో ఆ బాలిక అక్కడి నుంచి పారిపోయినట్టు సమాచారం. బాలికను కొనుగోలు చేసిన వ్యక్తిపై, బాలిక తండ్రిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోగా బాలికను కొనుగోలు చేసిన వ్యక్తిపై గతంలోనే అనేక కేసులు నమోదైనట్టు పోలీసులు చెబుతున్నారు.

 

కాగా ఈ వార్తను చదివిన నెటిజన్లు బాలిక తండ్రిపై అగ్రహాన్నీ వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అతన్ని దారుణమైన పదజాలంతో తిడుతున్నారు. కాగా ఈ సంవత్సరం కసాయి తండ్రి అవార్డు ఇతనికే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: