అమెరికాలో అక్రమ వలసదారులు ఎంట్రీ ఇవ్వకుండా కట్టడి చేస్తూ, వీసాల జారీల విషయంలో కటైనమైన నిభందనలు పాటిస్తున్న ట్రంప్ ప్రభుత్వం, బర్త్ టూరిజం వీసాపై కూడా సరికొత్త ఆంక్షలు పెట్టింది. ఈ నేపధ్యంలో అమెరికా వచ్చే గర్భిణులుకి ఈ నిర్ణయం పెద్ద షాక్ ఇస్తుందనే చెప్పాలి. ఎందుకంటే. గర్భిణులు ఎంతో మంది డెలివరీ అయ్యే సమయంలో అమెరికాలోని ఆసుపత్రిలో చేరడం కోసం వివిధ దేశాల నుంచీ కావాలనే అమెరికా వెళ్తుండటం ప్రధాన కారణం..
అమెరికాలోని నియమ నిభంధనల ప్రకారం, తల్లి ఏ దేశస్తు రాలినా సరే అమెరికాలో గనుకా తన బిడ్డకి జన్మని ఇస్తే ఆ బిడ్డకి అమెరికా పౌరసత్వం వస్తుంది. ఈ నిభందనని అడ్డుపెట్టుకుని కొన్ని వీసా మోసాలు ప్రతీ ఏడాది వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయని అంటున్నారు ఇమ్మిగ్రేషన్ అధికారులు.అందుకే ట్రంప్ ప్రభుత్వం సరికొత్త వీసా నిభందనని తెరపైకి తీసుకువచ్చింది.
ఈ వీసా నిభందనలు ఈరోజు నుంచే అమలులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. అయితే అమెరికాకి వచ్చే గర్భిణులు ఈ కారణంగానే వస్తున్నారా లేదా మెరుగైన వైద్య చికిత్సల కోసం వస్తున్నారా అనేది ఎలా పసిగాట్టాలనే విషయంపై ఓ క్లారిటీ కి వచ్చినట్టుగా అధికారులు తెలిపారు.