ఆయనో కుబేరుడు.. లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. కానీ ఎంత ఆస్తి ఉన్నా ఇంకా సంపాదిద్దామనే వాళ్లే ఈ లోకంలో ఎక్కువ . కానీ ఆయన మాత్రం ఒక్క సంతకంలో ఏకంగా 7 వేల కోట్లరూపాయలు దానం చేసేశాడు. అయితే ఈ దానం ఎందుకోసమో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.
ప్రపంచ వ్యాప్తంగా నియంతృత్వపాలన ధోరణి అంతకంతకూ పెరుగుతోందని దాన్ని అరికట్టేందుకు ఈ సొమ్ము వినియోగించాలని కండిషన్ పెట్టాడు. ఇంతకూ ఈ యన ఎవరంటారా.. ఆయనే అమెరికా కుబేరుడు, దాత జార్జ్ సోరోస్.
ప్రస్తుతం ప్రపంచం నియంతల చేతుల్లో మగ్గుతోందని.. భావి నియంతల ఒత్తిళ్ల నుంచి పౌరసమాజాన్ని రక్షించేందుకు తన జీవితంలోఅత్యంత ముఖ్యమైన ప్రాజెక్టును చేపడుతున్నానని ఆయన ప్రకటించారు. ఇలా నియంతలను అరికట్టాలంటే ఏం చేయాలి.. అనే అంశంపై బోధన, పరిశోధనల నిమిత్తం 'ఓపెన్ సొసైటీ యూనివర్సిటీ నెట్ వర్క్ ను స్థాపిస్తున్నట్టు సోరోస్ ప్రకటించారు.
ఆయన ఇందుకోసం వంద కోట్ల అమెరికా డాలర్లను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. అంటే మన కరెన్సీలో 7,127 కోట్ల రూపాయలు అన్నమాట. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఈయన ఈ ప్రకటన చేశారు. గ్రేట్ కదా.