కరోనా కారణంగా ఎన్ని మార్పులు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రోజుకో మార్పు జరుగుతుంది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని అంత చుట్టేసింది. ఇక అలాంటి వైరస్ భారత్ ను కూడా గడగడలాడిస్తోంది అంటే నమ్మండి. అలాంటి ఈ కరోనా వైరస్ కారణంగా ఓ దేశంలో విదేశీయులకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు అంటే నమ్మండి. 

 

ఏ దేశం అనుకుంటున్నారా? అదేనండి.. ఒమన్ దేశం. కరోనా వైరస్ కారణంగా మంగళవారం ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 17 నుండి దేశంలోకి విదేశీయులు రాకుండా నిషేధం విధించింది. కాగా, గల్ఫ్ దేశాల పౌరులకు ఈ నిషేధం వర్తించదని ఒమన్ పేర్కొంది. అంతేకాదు.. శుక్రవారం అంటే ఈరోజు చేసే ప్రార్థనలను కూడా నిలిపివేశారు. 

 

ఎంటర్టైన్‌మెంట్ కార్యక్రమాలు, వివాహాలు, ఇతర కార్యాలను కూడా ఆ దేశ ప్రభుత్వం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న పార్కులు, మ్యూజియాలు కూడా మూసివేశారు. కరోనాను ఎదుర్కోడానికి ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు చేసేందుకు ఏర్పాటైన సుప్రీం కమిటీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: