అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి చేయిదాటుతోంది. ఇప్పటికే లక్ష మంది కరోనా భారీన పడగా వారిలో 1600 మంది మృతి చెందారు. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జనాలు పిట్టల్లా రాలిపోతూ ఉండటంతో అమెరికా కలవరపాటుకు గురవుతోంది. హాస్పిటల్స్, మెడిసిన్స్, ఎక్విప్ మెంట్ కొరతతో అమెరికా పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. 
 
చైనా, ఇటలీ దేశాలను మించి అమెరికాలో బాధితుల సంఖ్య నమోదు కావడం అగ్ర రాజ్యాన్ని షాక్ కు గురి చేస్తోంది. నిన్న ఒక్కరోజే 300 మరణాలు నమోదు కావడంతో అమెరికా కరోనాను కట్టడి చేయడానికి అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఆఖరుకు వెంటిలేటర్స్ కూడా లేకపోవడంతో... పరిధి చేదాటి పోతూ ఉండటంతో ట్రంప్ రంగంలోకి దిగాడు. వెంటనే అవసరాలకు తగిన విధంగా వెంటిలేటర్స్ తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశాడు. 
 
అమెరికాలోని టెస్టింగ్ మెటీరియల్స్ లోపాల వల్లే మృతుల సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో 175 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. కానీ కరోనా బాధితులు మాత్రం లక్ష మంది ఉన్నారు. అమెరికా ప్రస్తుతం కరోనా ప్రభావంతో దయనీయమైన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కరోనా ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అమెరికా వివిధ దేశాలకు ఆర్థిక సాయం ప్రకటించింది.అందులో భాగంగా అమెరికా భారత్ కు 2.9 మిలియన్స్ డాలర్లు ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో ప్రకటించిన 100 మిలియన్స్ డాలర్ల ప్యాకేజీకి అదనంగా ఈ నగదును ప్రకటించింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: