కోరనా  కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఆయా దేశాలలో ఉంటున్న వలస వాసుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ముఖ్యంగా విద్యార్థుల పరిస్థితిలు దారుణంగా ఉన్నాయి. అమెరికాలో అత్యధికంగా సుమారు 2.5 లక్షల మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. అమెరికాలో కరోనా  విజృంభించిన క్రమంలో యునివర్సిటీలో హాస్టళ్లు మూసివేసిన తరువాత విద్యార్ధులు దిక్కు తోచని స్థితిలో  ఉండగా అమెరికాలోని భారతీయ సంస్థలు ఎన్నో విద్యార్ధులకి భరోసా ఇచ్చాయి..

 

విధ్యర్దులకి కావాల్సిన అవసరాలు సమకూర్చుతూ తమవంతు సాయం చేస్తున్నాయి. ఈ క్రమంలో 500 మంది భారతీయ విద్యార్థులు భారత దౌత్య కార్యాలయ అధికారులతో తాము ఎదుర్కుంటున్న పరిస్థితులు వివరించారు. ఎంతో మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్న క్రమంలో భారత రాయబారి తరంజిత్ సింగ్ ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో విద్యార్థులతో మాట్లాడారు అమెరికాలో పరిస్థితులు బాగా లేనందున ఎక్కడివారు అక్కడే ఉండాలని సూచనలు చేశారు..

 

కరోనా తగ్గే  క్రమంలో పరిస్థితులు ఎప్పుడైతే అదుపులోకి వస్తాయో  అప్పుడే మీ మీ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. వీసా కాలం అయిపోయినా కంగారు పడవలసిన అవసరం లేదని అమెరికాలో మరికొంతకాలం ఉండేలా వీసాలు  పొడిగించేందుకు భారత దౌత్య కార్యాలయం విద్యార్థులకు సహకరిస్తుందని ప్రకటించారు. అంతేకాదు భారతీయ విద్యార్ధుల కోసం భారత దౌత్య కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ని  అందుబాటులోకి తీసుకువచ్చారు

 

మరింత సమాచారం తెలుసుకోండి: