చైనాలో పుట్టిన కరోనా ప్రస్తుతం అమెరికాకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. అమెరికా వ్యాప్తంగా ప్రళయాన్ని సృష్టించిన కరోనా వేలాది మంది ప్రాణాలని బలి తీసుకోగా లక్షలాది మందిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ప్రస్తుతం అమెరికాలో మొత్తం 81 మందిని బలి తీసుకుంది. 13 లక్షల మంది పైగా కరోనా బారిన పడ్డారు. ఇదిలాఉంటే వైట్ హౌస్ లో ఇప్పటికే ముగ్గురుకి కరోనా సోకగా మిగిల వారికి వైద్య పరీక్షలు చేపడుతున్నారు..ఈ నేపధ్యంలోనే..
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హోమ్ క్వారంటైన్ లో ఉండిపోయారు. దాంతో ట్రంప్ కి ఒక్క సారిగా ఆందోళన నెలకొంది. అమెరికాలో ఉపాధ్యక్షుడికి కరోనా సోకితే తనకి ఎంతో అవమానంగా భావిస్తున్న ట్రంప్ తనకి ఆ వైరస్ సోకితే పరిణామాలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మీడియా కార్యదర్శి కి కరోనా సోకడంతో ప్రస్తుతం మైక్ సెల్ఫ్ క్వారంటైన్ లో సేద తీరుతున్నారు..మైక్ కి తరచుగా రక్త పరీక్షలు చేస్తున్న క్రమంలో నెగిటివ్ గానే రిపోర్ట్ అందుతోంది..
అయినా సరే తానూ అందరితో కలిసి ఉండటం మంచిది కాదని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు అంటు వ్యాధుల నివారణ కి చెందిన కీలక ప్రతినిధులు ముగ్గురు సైతం స్వీయ నిర్భంధంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వీరందరూ కరోనాపై పోరులో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సు లోని సభ్యులు కావడం గమనార్హం. ఇదిలాఉంటే ఇప్పటి వరకూ కరోనా పై పోరులో ఎంతో మంది వైద్యులు సైతం ప్రాణాలు వదిలారు. పభుత్వం నష్ట నివారణ చర్యలు చేపడుతున్నా కరోనా ప్రభాలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా ఒకరి నుంచీ మరొకరికి సోకడం ఆందోళన కలిగిస్తోన్న అంశం. ఈ మహమ్మారి ఏకంగా ప్రభుత్వ అధికారులకి, నేతలకి, నిపుణులకి సోకడంతో ఆందోళన చెందుతున్నారు ట్రంప్..