అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జార్జ్ మరణంతో అమెరికాలో నివురు గప్పుకున్న జాతి వివక్ష ఒక్కసారిగా బయటపడిందనే చెప్పాలి. జార్జ్ మరణంతో తల్లడిల్లిన నల్లజాతీయులు న్యాయం జరిగే వరకూ తమ పోరాటాని ఆపేది లేదని స్పష్టం చేస్తూనే ఉన్నారు. నల్లజాతీయుల నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. నిరసన కారులని చెదరగొడుతూ వారిపై అహంకార ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఎంతో మంది నిపుణులు , హాలీవుడ్ స్టార్స్, టెకీలు ఇలా ప్రతీ ఒక్కరూ తమదైన శైలిలో నిరసన తెలుపుతున్నారు...ఈ క్రమంలో
భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలపై జార్జ్ ఎఫ్ఫెక్ట్ పడకుండా ట్రంప్ తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. జార్జ్ మరణాన్ని ఇప్పటికే ప్రత్యర్ధి డెమోక్రటిక్ పార్టీ వాడేసుకుంటున్న నేపద్యంలో ట్రంప్ అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు. జార్జ్ మరణమే కాకుండా గతంలో కూడా ఓ నల్లజాతీయుడుపై పోలీసులు చేసిన దారుణమైన మరొక హత్యకి సంభందిన వీడియో బయటపడటంతో ఆఫ్రికన్ అమెరికన్స్ ట్రంప్ పై తీవ్రవ్యతిరేకతని కనబరుస్తున్నారు..దాంతో ఈ పరిణామాలని శాంతింపజేయడానికి ట్రంప్ వ్యుహలని రచిస్తున్న నేపద్యంలోనే
అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మిలటరీ చీఫ్ గా చార్లెస్ క్యూ బ్రౌన్ జూనియన్ అనే నల్ల జాతీయుడిని నియమించనున్నారు. ఇందుకు సంభందించిన బిల్లుని అమెరికా సెనేట్ 98 ఓట్లతో ఏకగ్రీవంగా ఆమోదించింది. చార్లెస్ ప్రస్తుతానికి ఫోర్ స్టార్ జనరల్ హోదాలో అమెరికా వైమానిక దళం చీఫ్ గా ఉన్నారు. జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఘటన తీవ్రంగా ఆలోచన చేసిన ట్రంప్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు జార్జ్ అంత్యక్రియల రోజునే చార్లెస్ ని నియమించడం సర్వాత్రా చర్చనీయంసం అయ్యింది. ట్రంప్ సైతం చార్లెస్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు.