జర్మనీలో అగ్రరాజ్య బలగాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికా బలగాలను 34,500 నుంచి 25 వేలకు కుదించేందుకు ఆదేశాలు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని సొంత పార్టీ సభ్యులే వ్యతిరేకిస్తున్నారు. జర్మనీలో అమెరికా బలగాలను భారీగా వెనక్కి తీసుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం జర్మనీలో 34,500 మంది అమెరికా సైనికులు ఉండగా వారిని 25 వేలకు కుదించేందుకు ఆలోచిస్తున్నామని స్పష్టం చేశారు.

 

ఏడాదిగా జర్మనీలో బలగాల పాక్షిక ఉపసంహరణకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటివరకు నిర్ణయాన్ని ప్రకటించకపోయినా ట్రంప్ ఈ విషయంలో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విషయానికి సంబంధించి నాటోకు కానీ, జర్మనీకి వెల్లడించలేదు. అమెరికా కాంగ్రెస్​కు కూడా వెల్లడించలేదు.

 

అమెరికాకు ముప్పు... 

ట్రంప్ నిర్ణయాన్ని సొంత పార్టీ సభ్యులే తప్పుబడుతున్నారు. ఈ విషయంలో పునరాలోచించుకోవాలని 22 మంది రిపబ్లికన్​ సభ్యులు లేఖ ద్వారా ట్రంప్​ను కోరారు. ట్రంప్ తీవ్రమైన తప్పు చేస్తున్నారని ఆరోపించారు. రష్యా నుంచి ముప్పు ఇంకా తగ్గలేదు. నాటోకు అమెరికా సహాయం తగ్గితే రష్యా మరింత దూకుడుగా వెళుతుంది. ఇది అమెరికా జాతీయ భద్రతకు చాలా ప్రమాదం. ప్రపంచవ్యాప్తంగా అమెరికా స్వేచ్ఛ, భద్రతకు సంబంధించి రష్యా, చైనా కమ్యూనిస్టు పార్టీలతో విఘాతం ఏర్పడుతోంది. ఇతర దేశాల్లో అమెరికా ఉనికి ఇప్పుడు అత్యంత కీలకం." 

 

రిపబ్లికన్ సభ్యుల లేఖ సారాంశం ...

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అప్పటి సోవియట్ యూనియన్​ను నియంత్రించేందుకు జర్మనీ కేంద్రంగా అమెరికా, నాటో బలగాలు కృషి చేశాయి. ప్రస్తుతం జర్మనీలో ఉన్న బలగాలు గతంతో పోల్చితే చాలా తక్కువ. ప్రస్తుతం జర్మనీలో 34 వేల సైనికులతో పాటు 17,500 మంది రక్షణ శాఖ పౌరులు ఉన్నారు.

 

2 శాతం నిబంధన ... 

దశాబ్దాలుగా అమెరికా సైనికులకు జర్మనీ ఆతిథ్యం ఇస్తూ వస్తోంది. ఇరాక్​ సహా పశ్చిమాసియా దేశాల్లో బలగాలను మోహరించేందుకు జర్మనీ కీలక మాధ్యమంగా ఉపయోగపడింది. అయితే తమ బలగాలకు జర్మనీ తగినంత చెల్లించట్లేదని ట్రంప్ ఆరోపించారు. దీర్ఘకాలంగా నాటో మిత్రపక్షమైన జర్మనీని అపరాధిగా అభివర్ణించారు ట్రంప్.

మరింత సమాచారం తెలుసుకోండి: