కోవిడ్ ఒకవైపు - ఎన్నికలు ఒకవైపు... దీంతో పదవి ఎక్కడ చేజారుతుందో అన్న భయంతో ట్రంప్ ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా నిర్ణయాలు తీసేసుకుంటు న్నాడు. దీంతో అవి బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. ఇటీవలే ప్రవాసులపై అనేక ఆంక్షలు విధించడం, వీసాలు రద్దు వంటివి చేసిన ట్రంప్... చివరకు విదేశాల నుంచి ఆన్ లైన్ క్లాస్ లు వింటు అమెరికన్ యూనివర్సిటీ విద్యార్థులు వీసాలు రద్దుచేయడం సంచలనంగా మారింది. త్వరలో ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం పై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. దాంతో ఈ అగ్రరాజ్య అధ్యక్షుడు దిగిరాక తప్పలేదు. ఆన్ లైన్ క్లాసులను ఎంచుకున్న విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందేనంటూ, తీసుకుని వచ్చిన వివాదాస్పద నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.
జూలై 6న యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) ఈ ఆదేశాలను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన హార్వార్డ్, మసాచుసెట్స్ ఆఫ్ టెక్నాలజీస్, ఐటీ సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, మరో 17 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో విద్యార్థి వీసాపై ఉంటే కోవిడ్ వల్ల ఆన్‌లైన్ పాఠాలు వింటున్న విదేశీ విద్యార్థులు.
వీరందరు ఆన్ లైన్ క్లాసుల కోసం ఇక్కడుండాల్సిన అవసరం ఏంటి? దేశం విడిచి వెళ్లాలని అమెరికా ఆదేశించింది. దీంతో అమెరికా విద్యాసంస్థలు కేవలం దీనిని వ్యతిరేకించడమేకాదు కాదు కోర్టుకు ఎక్కాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హార్వర్డ్, మసాచుసెట్స్ యూనివర్సిటీలు.. కోర్టులో దావా వేశాయి. అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ)పై కేసును ఫైల్ చేశాయి. ఈ నేపథ్యంలో తమ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.